ఎస్టీ కాలనీ ప్రజలతో మాజీ జడ్.పి.టి.సి దీపావళి సంబరాలు

*ఎస్టీ కాలనీ ప్రజలతో మాజీ జడ్.పి.టి.సి దీపావళి సంబరాలు* వింజమూరు: వింజమూరులోని జీ.బి.కే.ఆర్ ఎస్టీ కాలనీ ప్రజలతో మాజీ జడ్.పి.టి.సి సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తిప్పిరెడ్డి. నారపరెడ్డి దీపావళి సంబరాలు నిర్వహించారు. ముందుగా ఆయన బాణాసంచాను కొనుగోలు చేసి కాలనీవాసులకు అందజేసి వారిలో అనంద భరిత వాతావరణమును సృష్టించారు. కాలనీ వాసులతో పాటు చిన్నపిల్లలకు స్వీట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా వింజమూరులో పేదరికాన్ని జయించి వైద్య వృత్తిని చేపట్టిన చంద్రను ఆయన కాలనీ వాసులకు పరిచయం చేశారు. చిన్నారులకు పాటల పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులు ముఖ్యంగా చదువు పట్ల ఆసక్తిని కలిగి ఉండాలన్నారు. కృషి, పట్టుదల, సంకల్ప దీక్ష ఉంటే భవిష్యత్ లో ఉన్నత శిఖరాలను సులభంగా అధిరోహించవచ్చని వైద్యుడు చంద్ర పరిస్థితిని ఉదాహరణగా చెబుతూ విద్యపై అందరూ ఆసక్తిని పెంపొందించుకోవాలని హితభోధ చేయడం జరిగింది. ఎస్టీ కాలనీ అభివృద్ధికి గతంలో విశేషంగా కృషి చేశామన్నారు. ఈ దీపావళి పండుగను ఎస్టీ కాలనీ ప్రజల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. కాలనీలో ప్రతి ఒక్కరూ వారి వారి పిల్లల ఉజ్వల భవిత కోసం ఖచ్చితంగా పాఠశాలలకు పంపించాలని కోరారు. స్థానిక దేవాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమం కోలాహలంగా సాగింది